మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాట్సాప్‌ను రిట్రీవ్ చేసిన ఈడీ... 9 గంటలుగా కొనసాగుతున్న విచారణ
- ఓ వ్యక్తి విచారణ సందర్భంగా మంచిరెడ్డి లావాదేవీలపై ఈడీకి అనుమానం
- అతి తక్కువ కాలంలో రూ.88 కోట్ల లావాదేవీలు నిర్వహించిన మంచిరెడ్డి
- శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌ల్యాండ్ లలో పెట్టుబడి పెట్టినట్లు అనుమానం
- క్యాసినో, గోల్డ్ మైన్లలో మంచిరెడ్డి పెట్టుబడి?
ఫెమా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలతో విచారణకు పిలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈడీ నోటీసులతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మంచిరెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకోగా... రాత్రి 9 గంటలు దాటినా... అధికారులు ఆయనను విచారిస్తూనే ఉన్నారు. ఈ విచారణ ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.
ఓ కేసు విచారణ సందర్భంగా ఓ వ్యక్తిని ఈడీ అధికారులు విచారించగా...మంచిరెడ్డి లావాదేవీలకు సంబంధించిన పలు వివరాలు ఈడీకి తెలిశాయి. అతి స్వల్పకాలంలోనే మంచిరెడ్డి దాదాపుగా రూ.88 కోట్లకు పైగా లావాదేవీలు నెరపారట. అది కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌ల్యాండ్ తదితర దేశాల్లో ఆయన ఈ లావాదేవీలు జరిపినట్లుగా ఈడీ అధికారులు నిర్ధారించారు. ఈ దేశాల్లోని క్యాసినో, గోల్డ్ మైన్లలో మంచిరెడ్డి పెట్టుబడి పెట్టినట్లుగా ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో మరింత మేర ఆధారాలు సేకరించే దిశగా ఈడీ అధికారులు విచారణను సాగిస్తున్నారు. ఇందులో భాగంగా మంచిరెడ్డి వాట్సాప్ సందేశాలను ఈడీ అధికారులు రిట్రీవ్ చేసినట్టుగా సమాచారం. ఈ సమాచారం ఆధారంగా మంచిరెడ్డిని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.