152 సినిమాలు చేసిన మెగాస్టార్ ను ఎలా డీల్ చేయాలనేదే నా టెన్షన్: మోహన్ రాజా

  • ఈ నెల 5వ తేదీన విడుదలైన 'గాడ్ ఫాదర్'
  • తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా 
  • తొలి రోజున రికార్డుస్థాయి వసూళ్లు నమోదు 
  • తాను చేసిన కసరత్తును గురించి చెప్పుకొచ్చిన మోహన్ రాజా    
మలయాళంలో మోహన్ లాల్ చేసిన 'లూసిఫర్' ఘన విజయాన్ని సాధించింది. ఆ సినిమా రీమేకులో చేయాలని మొదటి నుంచి చిరంజీవి ఆసక్తిని చూపుతూ వచ్చారు. ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఎలా మార్చాలి? దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించాలి? అనే విషయంపై చిరంజీవి చాలా రోజుల పాటు ఆలోచన చేశారు. ఆ తరువాత ఆ ప్రాజెక్టును మోహన్ రాజా చేతుల్లో పెట్టారు. దసరా కానుకగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా తొలి షో తోనే హిట్ టాక్ తెచ్చుకుంది. 

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో మోహన్ రాజా మాట్లాడూతూ .. "2020 నవంబర్లో చిరంజీవిగారు నాకు ఈ ప్రాజెక్టును అప్పగించారు. 'లూసిఫర్' పట్ల నాకు గల ప్రేమ ఈ రీమేకును ఒప్పుకునేలా చేసింది. మలయాళ ప్రేక్షకుల అభిరుచి వేరు .. తెలుగు ఆడియన్స్ టేస్టు వేరు. అందువలన ఆ కథను ఇక్కడి ప్రేక్షకులకు ఎలా ఎక్కించాలా అనేదే నాముందు సవాలుగా నిలిచింది. ఆ అంశంపైనే నేను కసరత్తు చేస్తూ వెళ్లాను. 

చిరంజీవిగారు ఆల్రెడీ 152 సినిమాలు చేశారు. అంతటి హీరోను కొత్తగా చూపించడమనేది అంత తేలికైన విషయమేమీకాదు. ఏ ఒక్క  సీన్ గానీ .. షాట్ గాని రిపీట్ అనిపించకూడదు. ఈ విషయంలోనే నేను టెన్షన్ పడాల్సి వచ్చింది. ప్రతి సీన్ ను థియేటర్లో ఆడియన్స్ మధ్య కూర్చుని చూస్తున్నట్టుగా అనుకుంటూ డిజైన్ చేసుకున్నాను. అందుకు తగిన రెస్పాన్స్ థియేటర్స్ నుంచి వస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోంది" అంటూ చెప్పుకొచ్చాడు.


More Telugu News