లెనోవో నుంచి అదిరిపోయే ఫీచర్లతో ప్రీమియం ట్యాబ్

  • 2.5కే ఓఎల్ఈడీ డిస్ ప్లే
  • నాలుగు స్పీకర్ల సిస్టమ్
  • ఈ నెల 17 నుంచి విక్రయాలు
  • 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీ ధర రూ.39,999
లెనోవో మంచి ప్రీమియం ట్యాబ్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ట్యాబ్ పీ11 ప్రో పేరుతో వచ్చిన ఇందులో 11.2 అంగుళాల 2.5కే ఓఎల్ఈడీ టచ్ స్క్రీన్ ఉంటుంది. డాల్బీ అట్మాస్, హెచ్ డీఆర్ 10 ప్లస్, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 360 హెర్జ్ టచ్ రెస్పాన్స్ తో ఈ ట్యాబ్ వస్తుంది. నాలుగు స్పీకర్ల సిస్టమ్ ఉంటుంది. 

ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో ఇది పనిచేస్తుంది. కనీసం రెండు ఆండ్రాయిడ్ అప్ గ్రేడ్స్ ను లెనోవో ఆఫర్ చేస్తోంది. మీడియాటెక్ కాంపానియో 1300టీ ఆక్టాకోర్ ప్రాసెసర్  ఏర్పాటు చేశారు. స్నాప్ డ్రాగన్ 730జీ కంటే 120 శాతం మెరుగైన పనితీరు ఇస్తుందని కంపెనీ అంటోంది. ఈ ట్యాబ్ తో పాటు ప్రెసిషన్ పెన్ 3 కూడా వస్తుంది. వైర్ లెస్ చార్జింగ్, స్టోరేజీకి ఈ పెన్ 3ని మ్యాగ్నెటిక్ గా అటాచ్ చేసుకోవచ్చు. 

8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో వస్తుంది. 8,200 ఎంఏహెచ్ తో బ్యాటరీని ఉంది. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో ఉండే దీని ధర రూ.39,999. లెనోవో, అమెజాన్ పోర్టల్స్ పై ఈ నెల 17 నుంచి విక్రయాలకు అందుబాటులో ఉంటుంది. ఆప్షనల్ గా డిటాచబుల్ కీబోర్డును కొనుగోలు చేసుకోవచ్చు.


More Telugu News