'కాంతారా' సినిమాకు లీగల్ నోటీసు పంపించిన 'తైక్కుడం బ్రిడ్జ్'
- తమ 'నవరస' పాటను కాపీ కొట్టారన్న తైక్కుడం బ్రిడ్జ్
- కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొన్న వైనం
- చట్టపరమైన చర్యలను తీసుకుంటామన్న తైక్కుడం బ్రిడ్జ్
కన్నడ సినీ నటుడు, దర్శకుడు రిషభ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతారా' సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. భాషలకు అతీతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్ర బృందానికి 'తైక్కుడం బ్రిడ్జ్' మ్యూజిక్ బ్యాండ్ లీగల్ నోటీసులు పంపింది.
'కాంతార' పతాక సన్నివేశాల్లో వచ్చే 'వరాహ రూపం' పాట తమ 'నవరస'కు కాపీ అని నోటీసులో పేర్కొంది. అంతేకాదు తమకు మద్దతు ఇవ్వవలసిందిగా సోషల్ మీడియాలో నెటిజన్లకు విన్నవించింది. 'కాంతార' చిత్రానికి, తమకు ఎలాంటి సంబంధం లేదని... తమ పాట కాపీ రైట్ చట్టాలను ఉల్లంఘించారని చెప్పారు. అందువల్లే ఈ కాపీకి కారణమైన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.