బిగ్ బాస్ హౌస్ కి కెప్టెన్ కాగానే ' ఇది నా టైమ్' అంటూ హెచ్చరించిన శ్రీహాన్!
- 54వ రోజుకి చేరుకున్న 'బిగ్ బాస్ 6'
- కెప్టెన్సీ దక్కించుకున్న శ్రీహాన్
- వరస్ట్ పెర్ఫార్మర్ గా జైలుకి వెళ్లిన బాలాదిత్య
- ఇనయాకీ శ్రీహాన్ కి మధ్య జరిగిన వాదన
'బిగ్ బాస్ హౌస్' లో పోటీదారులు 54వ రోజుకి చేరుకున్నారు. కెప్టెన్సీ కోసం జరిగిన పరీక్షలో శ్రీహాన్ విజయాన్ని సాధించాడు. హౌస్ లోని ఎక్కువమంది సభ్యులు అతని కెప్టెన్సీని కోరుకున్నారు. దాంతో వాళ్లకి థ్యాంక్స్ చెప్పిన శ్రీహాన్, పెద్దగా ఆలస్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగిపోయాడు. అతనికిగల కెప్టెన్సీ అధికారంతో, ఆ వారం వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరనేది ముఖానికి రంగుపూయడం ద్వారా గుర్తించి వారిని జైలుకు పంపించమనే ఆదేశం బిగ్ బస్ నుంచి వచ్చింది.
దాంతో శ్రీహన్ తన చేతులకు ఎరుపు రంగు పులుముకుని, ఆ వారం వరస్ట్ పెర్ఫార్మర్ బాలాదిత్య అంటూ ముఖానికి రంగు పూశాడు. తనని వరస్ట్ పెర్ఫార్మర్ గా శ్రీహాన్ భావించడం పట్ల బాలాదిత్య అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. తన ఆట తీరును అర్థం చేసుకోలేదంటూ అసహనాన్ని ప్రదర్శించాడు. శ్రీహాన్ ధోరణిని తప్పుబడుతూనే జైలుకి వెళ్లాడు. ఇక ఆ తరువాత హౌస్ లోని ఫుడ్ ఐటమ్స్ ఫై శ్రీహాన్ దృష్టి పెట్టాడు. ఆ విషయాన్ని గురించి హౌస్ లోని సభ్యులందరితో మాట్లాడటానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.
కిచెన్ బాధ్యతను ఇనయా తీసుకుంటే బాగుంటుందనీ .. అందుకు అవసరమైన రేషన్ విషయం రేవంత్ తీసుకుంటాడని శ్రీహాన్ చెప్పాడు. ఇనయా తాను వంట చేయనంటూనే అందుకు ఒక కారణం చెప్పింది. అంతకుముందు కర్రీలేని కారణంగా రైస్ వదిలేశానని చెప్పింది. ఈ విషయంలోనే ఇద్దరి మధ్యా మాటా మాట పెరిగింది. ఇది తాను ఏర్పాటు చేసిన మీటింగ్ అనీ .. ఇక్కడ తాను మాత్రమే మాట్లాడాలనీ .. ఇది నా టైమ్ అంటూ శ్రీహాన్ సీరియస్ అయ్యాడు. ఆమె అభిప్రాయం ఏదైనా ఉంటే ఆ తరువాత మిగతావారికి చెప్పుకోమని మండిపడటంతో అక్కడి వాతావరణం మరింత వేడెక్కింది.