తెలంగాణను దోచుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిది: బాల్క సుమన్
- షర్మిల సంస్కారహీనంగా మాట్లాడుతున్నారన్న సుమన్
- జగన్ ను తెలంగాణ ప్రజలు అడ్డుకున్న చరిత్రను మర్చిపోవద్దని వ్యాఖ్య
- షర్మిల, ఆమె భర్త బయ్యారం గనులను కొల్లగొట్టాలని చూశారని విమర్శ
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె సంస్కారహీనంగా మాట్లాడుతూ, అడుగడుగునా తెలంగాణను అవమానిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వనరులను దోచుకున్న చరిత్ర వైఎస్ కుటుంబానిదని... గతంలో మానుకోటలో జగన్ ను తెలంగాణ ప్రజలు అడ్డుకున్న చరిత్రను మర్చిపోవద్దని అన్నారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆనాడు పార్లమెంటులో జగన్ ప్లకార్డులను ప్రదర్శించారని చెప్పారు.
'మీరు తిరిగి వచ్చుంటే రాష్ట్రం ముక్కలయ్యేది కాదు రాజన్నా' అంటూ షర్మిల గతంలో తన తండ్రి వైఎస్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారని గుర్తు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ బయ్యారం గనులను కొల్లగొట్టాలని చూశారని దుయ్యబట్టారు. కిరాయి మనుషులైన షర్మిల వంటి వ్యక్తుల తోలుబొమ్మలాటను తెలంగాణ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. షర్మిల భాష మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.