ఒక్క ట్వీట్ తో రూమర్లకు అడ్డుకట్ట వేసిన సమంత

  • మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత
  • కొన్ని రోజులుగా సమంత మౌనం
  • ఆసుపత్రిపాలైందంటూ ప్రచారం
  • అడివి శేష్  ట్వీట్ కు బదులిచ్చిన సామ్
తాను మయోసైటిస్ అనే ఇమ్యూనిటీ సంబంధ సమస్యతో బాధపడుతున్నట్టు ఇటీవల సమంత వెల్లడించడం తెలిసిందే. అయితే, గత వారం రోజులుగా సమంత నుంచి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో ఆమె అనారోగ్యంతో ఆసుపత్రి పాలైందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత పరిస్థితి ఇప్పుడేమీ బాగోలేదని కథనాలు వచ్చాయి. 

అయితే ఈ ఊహాగానాలకు సమంత ఒక్క ట్వీట్ తో అడ్డుకట్ట వేసింది. టాలీవుడ్ నటుడు అడివి శేష్... 'హిట్' ఫ్రాంచైజీ తదుపరి సినిమాలో సమంత లీడ్ రోల్ పోషిస్తే బాగుంటుందన్న ఓ పాత్రికేయుడి ట్వీట్ ను రీట్వీట్ చేశారు. ఏమంటావు సామ్ అంటూ అడివి శేష్ ఆమె అభిప్రాయాన్ని కోరారు. 

అందుకు సమంత స్పందించారు. పోలీసు పాత్రనా... భలే తమాషాగా అనిపిస్తోంది. హిట్-2 సూపర్ హిట్ అయినందుకు కంగ్రాచ్యులేషన్స్ అడివి శేష్. నువ్వు విజయం అందుకోవాలని ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటాను అంటూ సమంత ట్వీట్ చేశారు. మొత్తమ్మీద సామ్ ఈ ట్వీట్ తో తన అభిమానులను ఎంతో సంతోషానికి గురిచేశారు.


More Telugu News