కృతిశెట్టి తమిళ సినిమా ఆగిపోయిందా?
- వరుస హిట్లతో కెరియర్ ను మొదలెట్టిన కృతి
- ఆ తరువాత వరుసగా పడిన మూడు ఫ్లాపులు
- ఆగిపోయిన తమిళ ప్రాజెక్టు
- మలయాళంలో అదృష్టాన్ని పరీక్షించుకునే ఆలోచన
టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన గ్లామరస్ హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరుగా కనిపిస్తుంది. తొలి సినిమా 'ఉప్పెన' రిలీజ్ కావడానికి ముందే రెండు సినిమాల్లో ఆమె బుక్ అయింది. ఆ తరువాత హ్యాట్రిక్ హిట్ ను కొట్టేసి యూత్ లో తనకి గల క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఆమె సక్సెస్ రేటుకి తగినట్టుగానే పారితోషికం కూడా పెరిగింది.
అయితే ఆ తరువాత కృతి శెట్టి ఒప్పుకున్న మూడు సినిమాలు ఒకదాని తరువాత ఒకటిగా పరాజయం పాలవుతూ వచ్ఛాయి. రామ్ .. నితిన్ జోడీగా మంచి మార్కులు కొట్టేసిన ఆమెకి సక్సెస్ మాత్రం దూరంగానే ఉండిపోయింది. ప్రస్తుతం చైతూ సరసన నాయికగా 'కస్టడీ' సినిమాను చేస్తోంది.
ఇక ఇదే సమయంలో ఆమె సూర్య హీరోగా బాల దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి ఉంది. ఒక షెడ్యూల్ షూటింగ్ జరిగిన తరువాత ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని అంటున్నారు. కోలీవుడ్ కి పరిచయం కావొచ్చునని ఈ ప్రాజెక్టుపై భారీగా ఆశలు పెట్టుకున్న కృతిని ఇది నిరాశ పరిచే విషయమేనని అనుకోవాలి. కృతి స్పీడ్ తగ్గుతుందేమోనని అనుకుంటున్న సమయంలో ఆమె ఓ మలయాళ ప్రాజెక్టును దక్కించుకోవడం విశేషం.