దండకడియాల్ .. దస్తీ రుమాల్ : 'ధమాకా' నుంచి హుషారైన మాస్ బీట్!
- రవితేజ తాజా చిత్రంగా రూపొందిన 'ధమాకా'
- మాస్ యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
- జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో రవితేజ మార్క్ పాట
- జానపద బాణీలో కంపోజ్ చేసిన భీమ్స్
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
రవితేజ అంటేనే మాస్ .. అందువల్లనే ఆయన సినిమాల్లో మాటలు .. పాటలు ఆ దారిలోనే నడుస్తాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ధమాకా' సిద్ధమవుతోంది. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకి, నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించాడు.
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. రవితేజ - శ్రీలీలపై ఈ హుషారైన పాటను చిత్రీకరించారు. ప్రత్యేకంగా వేసిన సెట్లో కలర్ ఫుల్ గా ఈ పాటను పిక్చరైజ్ చేశారు. 'దండకడియాల్ దస్తీ రుమాల్ మస్తుగున్నోడంటివే పిల్లో' అంటూ ఈ పాట సాగుతోంది.
జానపద బాణీలో జోరుగా నడిచే ఈ పాటను భీమ్స్ కంపోజ్ చేశాడు. ఆయనతో కలిసి సాహితి చాగంటి .. మంగ్లీ ఈ పాటను ఆలపించారు. జానీ మాస్టర్ నృత్య దర్శకత్వంలో జోరుగా మొదలైన ఈ పాట, కొంతదూరం వెళ్లిన తరువాత ఊపు తగ్గిందేమో అనిపిస్తుంది. ఈ నెల 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.