'వాల్తేరు వీరయ్య' షూటింగులో రవితేజ .. వర్కింగ్ స్టిల్స్ ఇవిగో!
- బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న 'వాల్తేరు వీరయ్య'
- ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న రవితేజ
- ఆయన సరసన అందాల సందడి చేయనున్న కేథరిన్
- సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్
- జనవరి 13వ తేదీన సినిమా విడుదల
రవితేజ హీరోగా బిజీ అయిన తరువాత .. ఆయనకి స్టార్ డమ్ వచ్చిన తరువాత, ఏ సినిమాలోను గెస్టు పాత్రలుగానీ .. ప్రత్యేక పాత్రలుగాని చేయలేదు. అలాంటి రవితేజ .. చిరంజీవి పట్ల గల గౌరవ భావంతో, 'వాల్తేరు వీరయ్య' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడు. ప్రస్తుతం 'వాల్తేరు వీరయ్య' సినిమాకి సంబంధించి, రవితేజ పోర్షన్ ను చిత్రీకరిస్తున్నారు. రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన పోరాట సన్నివేశాలను చిత్రీకరించే పనిలో దర్శకుడు బాబీ బిజీగా ఉన్నాడు. అందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ను షూటింగ్ స్పాట్ నుంచి వదిలారు. రవితేజ చేతుల్లో మేకపిల్ల .. చుట్టూ వేట కొడవళ్లతో కొంతమంది రౌడీలు .. ఇదంతా చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్నారనే విషయం అర్థమైపోతోంది. చిరంజీవి సరసన శ్రుతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాలో, రవితేజ జోడీగా కేథరిన్ అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు. జాలరుల గూడానికి నాయకుడిగా చిరంజీవి కనిపించనుండగా, ఆయన సవతి తల్లి కొడుకు పాత్రను రవితేజ పోషిస్తున్నాడు. యాక్షన్ తోను .. ఎమోషన్ తోను ఈ పాత్ర కనెక్ట్ అయ్యుంటుంది.