బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మోదీకి ఓటేసినట్టే: రేవంత్ రెడ్డి

  • గాంధీ భవన్ లో క్రిస్మస్ వేడుకలు
  • దళితులకు పెద్ద పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనన్న రేవంత్
  • పార్టీ అధ్యక్షుడిగా ఖర్గేకు అవకాశం ఇచ్చిందని వెల్లడి
  • ప్రాంతీయ పార్టీలు ప్రమాదకరంగా మారాయని వ్యాఖ్యలు
హైదరాబాద్ గాంధీ భవన్ లో దళిత కాంగ్రెస్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గొప్ప పరిపాలన అందించగల నేతలను కాంగ్రెస్ పార్టీ అందించిందని తెలిపారు. 

దేశంలో దళితులకు ముఖ్యమంత్రులుగా, కేంద్రమంత్రులుగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఇప్పుడు ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేకు అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఓ దళితుడ్ని పార్టీ అధ్యక్షుడిగా చేసే దమ్ము మిగిలిన పార్టీలకు ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

ఇక దేశంలో ప్రాంతీయ పార్టీలు హానికరంగా మారిపోయాయని అన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మోదీకి ఓటు వేసినట్టేనని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారినా, వీఆర్ఎస్ గా మారినా ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News