ఇక త్రిష జోరు కొనసాగడం ఖాయమే!
- టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న త్రిష
- కోలీవుడ్ లో తగ్గని హవా
- ప్రస్తుతం చేతిలో నాలుగు తమిళ సినిమాలు
- టాలీవుడ్ నుంచి వెళుతున్న భారీ ఆఫర్లు
త్రిషకి తెలుగు .. తమిళ భాషల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. 'నాయకి' తరువాత తెలుగులో అవకాశాలు తగ్గుతూ రావడంతో, తమిళ సినిమాలపైనే ఎక్కువగా దృష్టిపెడుతూ వచ్చింది. కొంతకాలంగా తెలుగు తెరకి పూర్తిగా దూరమైన త్రిష, తమిళంలో నాయిక ప్రధానమైన పాత్రలను ఒప్పుకుంటూ ముందుకు వెళుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తమిళ సినిమాలు ఉన్నాయి.
తమిళంలో నాయిక ప్రధానమైన పాత్రలను చేసే నయనతార ఒక రేంజ్ లో పారితోషికాన్ని పెంచుకుంటూ వెళ్లింది. దాంతో ఆమె కోసం అనుకున్న కథలు త్రిష దగ్గరికి వెళుతున్నాయని టాక్. ఇక ఇటీవల కాలంలో నయన్ గ్లామర్ తగ్గడం .. త్రిష గ్లామర్ పెరగడం కూడా అందుకు ఒక కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక తెలుగులో చూస్తే అనుష్క తరువాత నాయిక ప్రధానమైన పాత్రల విషయంలో సమంత తన సత్తా చాటింది. ఆమె చేసిన 'యశోద' సూపర్ హిట్ కాగా, 'శాకుంతలం' విడుదలకి సిద్ధమవుతోంది. అయితే ఇటీవల తన అనారోగ్య కారణాల వలన సమంత తన సినిమాల సంఖ్యను తగ్గించుకుంటోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి కూడా త్రిషకి భారీ ఆఫర్లు వెళుతున్నాయని అంటున్నారు. చూస్తుంటే వచ్చే ఏడాది త్రిష జోరు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.