‘కందుకూరు’ మృతుల కుటుంబాలకు టీడీపీ ఎన్నారై విభాగం అండ.. రూ. లక్ష చొప్పున పరిహారం: కోమటి జయరాం

  • చంద్రబాబు రోడ్ షో సందర్భంగా దుర్ఘటన
  • బాధిత కుటుంబాల పిల్లలు విదేశాల్లో చదువుకునేందుకు సహకారం అందిస్తామన్న కోమటి జయరాం
  • పరిహారం ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి రోడ్ షో సందర్భంగా మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఆ పార్టీ ఎన్నారై విభాగం ముందుకొచ్చింది. బాధిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ ఎన్నారై సెల్ నాయకుడు కోమటి జయరాం తెలిపారు.

మృతుల కుటుంబాలకు చెందిన పిల్లలు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే కనుక అన్ని విధాలుగా సాయం అందించేందుకు టీడీపీ ఎన్నారై విభాగం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కాగా, మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ రూ. 25 లక్షల పరిహారం ప్రకటించగా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెరో రెండేసి లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాయి. క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రభుత్వాలు ప్రకటించాయి.


More Telugu News