ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసి.. పొట్టలో టవల్ వదిలేసి కుట్లు వేసిన సర్జన్!

  • ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో ఘటన
  • కడుపు నొప్పి వస్తుంటే వాతావరణం వల్లేనన్న వైద్యుడు
  • మరో ఆసుపత్రిలో చూపిస్తే విషయం వెలుగులోకి
  • ఆపరేషన్ చేసి టవల్‌ను బయటకు తీసిన వైనం
గర్భిణికి ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసిన ఓ వైద్యుడు టవల్‌ను ఆమె పొట్టలోనే వదిలేసి కుట్లు వేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిందీ ఘటన. నెలలు నిండడంతో నజ్రానా అనే మహిళ స్థానిక సైఫీ నర్సింగ్ హోంలో చేరింది. ఆమెకు ఆపరేషన్ చేసిన మత్లూబ్ అనే వైద్యుడు బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత నజ్రానా కడుపునొప్పితో బాధపడింది.

వైద్యుడికి చెబితే చలి వాతావరణం కారణంగా అలా ఉంటుందని సర్దిచెప్పాడు. మరో ఐదు రోజులు ఆసుప్రతిలోనే అబ్జర్వేషన్‌లో ఉంచాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో నజ్రానా భర్త ఆమెను మరో ఆసుపత్రిలో చూపించాడు. అక్కడ ఆమెకు స్కాన్ చేసిన వైద్యులు పొట్టలో టవల్ ఉన్నట్టు గుర్తించారు. ఆమెకు మరో ఆపరేషన్ చేసి టవల్‌ను బయటకు తీశారు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) రాజీవ్ సింఘాల్ దర్యాప్తునకు ఆదేశించారు.


More Telugu News