హీరో సుధీర్ వర్మ ఆత్మహత్యకు సంబంధించిన డెత్ రిపోర్ట్ లో ఏముందంటే..?

  • నిన్న విశాఖలో సూసైడ్ చేసుకున్న సుధీర్ వర్మ
  • ఆయన విషం తీసుకున్నారని పేర్కొన్న డెత్ రిపోర్ట్
  • వర్మ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడన్న స్నేహితుడు
టాలీవుడ్ యువనటుడు సుధీర్ వర్మ విశాఖపట్నంలోని తన నివాసంలో నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరానప్పటికీ... వ్యక్తిగత కారణాలే దీనికి కారణం కావచ్చని భావిస్తున్నారు. నగరంలోని ఓ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలను నిన్న నిర్వహించారు. మరోవైపు వైద్యులు ఇచ్చిన డెత్ రిపోర్ట్ ప్రకారం... ఆయన విషం తీసుకున్నారు. ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. 

సుధీర్ వర్మ గురించి ఆయన స్నేహితుడు ఒకరు మాట్లాడుతూ... వర్మ చాలా మంచి వ్యక్తి అని, చాలా సున్నిత మనస్కుడని చెప్పారు. వర్మ తండ్రి ఏ1 కాంట్రాక్టర్ గా ఉండేవారని, తండ్రి మరణం తర్వాత వర్మ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు.


More Telugu News