పవన్ కొత్త సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్!
- తాజాగా సుజిత్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లిన పవన్
- డీవీవీ బ్యానర్లో నిర్మితమవుతున్న భారీ సినిమా
- పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అగ్రనిర్మాతలు
- త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్
పవన్ కల్యాణ్ తాజా చిత్రం ఈ రోజునే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. అల్లు అరవింద్ .. సురేశ్ బాబు .. దిల్ రాజు వంటి అగ్ర నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 'సాహో' సినిమాతో భారీ చిత్రాలను తీయగలనని నిరూపించుకున్న సుజిత్, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు.
డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. గతంలో ఆయన పవన్ తో 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాను నిర్మించాడు. మళ్లీ ఇప్పుడు వీరి కాంబినేషన్ వర్కౌట్ అయింది. ఈ సినిమా ఏ జోనర్ కి సంబంధించినది అనే విషయంతో పాటు మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.
ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయనే తెలియజేశాడు. గతంలో పవన్ సినిమాలైన 'వకీల్ సాబ్' .. 'భీమ్లా నాయక్'లకు ఆయనే సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఎప్పటి నుంచి మొదలవుతుందనేది చూడాలి.