అమెరికా గగనతలంలో కనిపించిన మరో అనుమానాస్పద వాహనం
- కారు మాదిరిగా వెళుతూ కనిపించిందన్నఅమెరికా భ్రదతా బలగాలు
- అధ్యక్షుడి ఆదేశాలతో కూల్చివేత
- మానవ రహిత వాహనంగా గుర్తింపు
అమెరికా వరుస వెంట భద్రతా సవాళ్లను ఎదుర్కొంటోంది. తమ దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలపైన సంచరిస్తున్న చైనా గూఢచర్య హీలియం బెలూన్ ను గత శనివారం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆదేశాల మేరకు పేల్చివేయడం తెలిసిందే. వారం తిరగక ముందే మరో గుర్తు తెలియని వాహనం ఆకాశ మార్గంలో కనిపించడంతో అక్కడి భద్రతా విభాగాలు ఉలిక్కిపడ్డాయి.
40,000 అడుగుల ఎత్తులో కారు మాదిరిగా వెళుతుండగా, దీన్ని శుక్రవారం అలాస్కా వద్ద గుర్తించారు. అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు కూల్చివేశారు. గత వారం కూల్చివేసిన చైనా బెలూన్ కంటే చిన్నదే. అయితే, 40,000 అడుగుల ఎత్తులో వెళుతున్నందున పౌర విమానాలకు ఈ మానవ రహిత వాహనం ప్రమాదకరమని అమెరికా అంటోంది. గత వారం చూసిన బెలూన్ కంటే ఇది చాలా చిన్నది అని దాన్ని కూల్చివేసిన పైలట్లు తెలిపారు. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే వీలున్న ఏఐఎం 9ఎక్స్ క్షిపణులతో కూల్చివేశారు. దీంతో శిధిలాలు నీటిలో పడిపోగా, వాటిని రికవరీ చేసుకుంటామనే ఆశాభావం నెలకొంది.