అనుష్కను చూశారా..? ఎంత బొద్దుగా తయారైందో..!

  • తెల్లటి వస్త్రధారణతో తళుక్కుమన్న అనుష్కశెట్టి
  • బెంగళూరులోని ఓ శివాలయంలో తల్లితో కలసి ప్రత్యక్షం
  • గతంతో పోలిస్తే లావెక్కిన అరుంధతి
అనుష్క శెట్టి సినీ కెరీర్ లో విరామం వచ్చింది. 2020లో అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ‘నిశ్శబ్దం’ సినిమాలో అనుష్కను చూశాం. ఆ తర్వాత ఇంత వరకు మరో సినిమా రాలేదు. మూడేళ్లు ఫాస్ట్ ఫార్వార్డ్ చేసి చూస్తే.. అనుష్క ఇంతకు ముందులా ఇప్పుడు లేదు. బొద్దుగా తయారైంది. మనిషి లావెక్కింది. 

ఇటీవల శివరాత్రి రోజున అనుష్క తన తల్లిదండ్రులతో కలసి బెంగళూరులోని ఓ శివాలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా ఆమెను కొందరు ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేశారు. తెల్లటి వస్త్రధారణతో అనుష్క కనిపించింది. ‘‘చాలా బాధగా ఉంది. ప్లీజ్ స్వీటీ వెంటనే స్లిమ్ అయిపో. నీ సినిమాలు మరెన్నో చూడాలని అనుకుంటున్నాం’’ అంటూ ఓ అభిమాని ట్విట్టర్ లో కామెంట్ చేశారు. 

అనుష్క లావెక్కడాన్ని కొందరు విమర్శిస్తుంటే, కొందరు తగ్గాలని సూచిస్తున్నారు. మరికొందరు ఆమెను వెనకేసుకొస్తున్నారు. అనుష్క బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా సఫలం కావడం లేదని, కొన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని, అందుకే ఆమె సినిమాలకు విరామం ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


More Telugu News