కృతి శెట్టి ఈ సారి హిట్టు కొట్టాల్సిందే!

  • తొలి సినిమాతోనే దూసుకెళ్లిన కృతి శెట్టి 
  • మూడో సినిమాతోనే కోటి రూపాయలు అందుకున్న బ్యూటీ 
  • యూత్ లో పెరిగిన విపరీతమైన క్రేజ్ 
  • నిరాశ పరిచిన వరుస ఫ్లాపులు 
  • కథల ఎంపికలో జాగ్రత్త పడుతున్న కృతి  
తెలుగు తెరను తాకిన అందాల 'ఉప్పెన'గా కృతి శెట్టిని గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ముందు ఈ స్థాయిలో మొదటి సినిమాతోనే యూత్ ను కట్టిపడేసే హీరోయిన్ రాలేదు. ఒకే ఒక్క సినిమాతో ఆమె యూత్ కలల రాణిగా మారిపోయింది. అమ్మాయిలు సైతం పొలోమంటూ ఆమెను ఫాలో అయ్యారు.

'ఉప్పెన' సినిమాకి కృతి తీసుకున్న పారితోషికం కేవలం 6 లక్షలు మాత్రమే. కానీ ఆ సినిమా ఏకంగా 100 కోట్లను కొల్లగొట్టేసింది. కోలకళ్ల విన్యాసాలతో .. ఆకర్షణీయమైన నవ్వుతో ఆమె పడుచు హృదయాలను దోచేసింది. దాంతో ఆ తరువాత సినిమాకే ఆమె 60 లక్షల పారితోషికం అందుకుంది. ఇక మూడో సినిమాకి కోటి రూపాయల పారితోషికాన్ని అందుకున్న కృతి శెట్టి, సీనియర్ హీరోయిన్స్ ను కంగారు పెట్టేసింది. 

కానీ ఆ తరువాత ఆమె చేసిన సినిమాల ఫలితాలు నిరాశ పరిచాయి. దాంతో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ సారి మాత్రం తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆమె ఉంది. ప్రస్తుతం ఆమె చైతూ జోడీగా 'కస్టడీ' సినిమా చేస్తోంది. శర్వానంద్ తో కూడా ఓ సినిమా చేయనుంది. ఆమె కోరుకుంటున్న హిట్ ఈ సినిమాలతో లభిస్తుందేమో చూడాలి. 



More Telugu News