పాకిస్థాన్ లో దారుణం.. హిందూ వైద్యుడి గొంతు కోసి హత్య
- పాకిస్థాన్‌లో హిందూ వైద్యుడిని హత్య చేసిన డ్రైవర్
- కారులో డాక్టర్ ఇంటికి వస్తుండగా డ్రైవర్‌తో వివాదం
- ఇంటికొచ్చాక డాక్టర్ హత్య
- హత్య జరిగిన మరుసటి రోజే నిందితుడి అరెస్ట్
పాకిస్థాన్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ (పాక్ లోని నగరం)కు చెందిన ప్రముఖ చర్మవ్యాధుల నిపుణుడు డా. ధరమ్‌దేవ్ రాఠీని ఆయన డ్రైవర్ మంగళవారం గొంతు కోసి చంపేశాడు. ఆ మరుసటి రోజే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కారులో ఇంటికి వస్తుండగా డా. ధరమ్‌దేవ్‌కు, డ్రైవర్‌కు మధ్య గొడవ జరిగినట్టు ధరమ్దేశ్ ఇంట్లోని వంటమనిషి పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలో వైద్యుడు ఇంట్లోకి వచ్చాక డ్రైవర్ వంటగదిలోని కత్తి తీసుకుని ఆయన గొంతు కోసి చంపేశాడు. ఆ తరువాత ధరమ్‌దేవ్ కారులోనే అక్కడి నుంచి ఉడాయించాడు.
కాగా.. పాకిస్థాన్‌లో మైనారిటీలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైద్యుడి హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనను రాజకీయ పార్టీలు ఖండించాయి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని పీపీపీ పార్టీ మహిళ శాఖ చీఫ్ హామీ ఇచ్చారు. పాకిస్థాన్‌లో హిందువులు హోలీ జరుపుకుంటున్న వేళ ఈ ఘటన జరగడం విచారకరమని వ్యాఖ్యానించారు. మరోవైపు.. హత్య జరిగిన 24 గంటలకే నిందితుడిని పట్టుకున్న పోలీసులను పాకిస్థాన్ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశంసించారు. కాగా..డా.ధరమ్‌దేవ్‌కు స్థానికంగా గొప్ప పేరుందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది.