వినాయక్ చేతుల మీదుగా కిరణ్ అబ్బవరం సినిమా లాంచ్!
- కిరణ్ అబ్బవరం నుంచి రానున్న 'మీటర్'
- కథానాయికగా అతుల్య రవి పరిచయం
- ఈ రోజునే పట్టాలపైకి వెళ్లిన 9వ సినిమా
- కథానాయికగా నజియా ఎంట్రీ
కిరణ్ అబ్బవరం హీరోగా ఆయన 9వ సినిమా పట్టాలెక్కింది. శివమ్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకి, విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొంతసేపటి క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. వీవీవినాయక్ క్లాప్ ఇవ్వడంతో .. సురేశ్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయడంతో ఈ సినిమా షూటింగు లాంఛనంగా మొదలైంది.
ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. త్వరలోనే రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. కిరణ్ అబ్బవరం ఇలా వరుసగా కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తుండటం విశేషమే. పెద్ద బ్యానర్లలో చేస్తుండటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. 'వినరో భాగ్యము విష్ణు కథ' సక్సెస్ టాక్ తెచ్చుకున్న కొన్ని రోజులకే .. 'మీటర్' లైన్లో ఉండగానే ఆయన ఈ సినిమాను పట్టాలెక్కించాడు.
'మీటర్' సినిమాలో కిరణ్ జోడీగా అతుల్య రవి కథానాయికగా నటించింది. ఇక కెరియర్ పరంగా కిరణ్ చేస్తున్న తొమ్మిదో సినిమాలో, నజియా కథానాయికగా అలరించనుంది. తెలుగులో ఆమెకి ఇదే ఫస్టు మూవీ. కిరణ్ అబ్బవరం కొత్త దర్శకులతో పాటు, కొత్త హీరోయిన్స్ ను కూడా తన సినిమాల ద్వారా పరిచయం చేస్తుండటం విశేషం.