నేడు ‘జగనన్న విద్యాదీవెన’ సాయాన్ని విడుదల చేయనున్న సీఎం

  • తిరువూరులో జరిగే కార్యక్రమంలో జమచేయనున్న జగన్
  • గతేడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను రూ. 698.68 కోట్ల జమ
  • ప్రతి త్రైమాసికం చివర్లో సాయాన్ని జమ చేస్తున్నట్టు చెప్పిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద గతేడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగే కార్యక్రమంలో మొత్తం 9.86 లక్షల మంది విద్యార్థుల ఖాతాలో రూ.698.68 కోట్ల నగదును జగన్ జమచేస్తారు. 

జగనన్న విద్యాదీవెన పథకం కింద బోధన రుసుములను క్రమం తప్పకుండా జమ చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ప్రతి త్రైమాసికం చివరలో సాయాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తున్నట్టు తెలిపింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం కింద ఇప్పటి వరకు మొత్తం రూ. 13,311 కోట్లు అందించినట్టు ప్రభుత్వం తెలిపింది.


More Telugu News