ఈఎస్ఐ ఆసుపత్రులలో ఉద్యోగాలు

  • హైదరాబాద్ జిల్లా పరిధిలో నియామకాలు 
  • అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు ఆహ్వానం
  • మొత్తం 114 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారుల వెల్లడి
హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని ఈఎస్‌ఐ హాస్పిటళ్లు, డిస్పెన్సరీలు, డయాగ్నస్టిక్ సెంటర్లలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ ఈ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపింది. నోటిఫికేషన్ లింక్ ఇదిగో

ఖాళీలు, కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలు..
  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ (59), డెంటల్ అసిస్టెంట్ సర్జన్ (01), ల్యాబ్ టెక్నీషియన్ (11), ఫార్మసిస్ట్ (43).. మొత్తం 114 పోస్టుల భర్తీ
  • పోస్టుల ఆధారంగా అభ్యర్థులు ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి
  • 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉండాలి
  • ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తులను పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్, అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పిటల్ సనత్‌నగర్, నాచారం, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి
  • చివరి తేదీ 28-03-2023
  • మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు
  • జీతభత్యాలు: సీఏఎస్‌, డీఏఎస్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.58,850; ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.31,040


More Telugu News