చరిత్ర సృష్టించిన ఫుట్ బాల్ స్టార్ రొనాల్డో

  • పోర్చుగల్ తరపున197 మ్యాచ్ లు ఆడిన రొనాల్డో
  • ఒక దేశం తరపున అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా రికార్డు
  • కెరీర్లో 120 గోల్స్ చేసిన సాకర్ దిగ్గజం
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించారు. తన అంతర్జాతీయ కెరీర్లో ఆయన 197వ మ్యాచ్ ఆడారు. తద్వారా ఒక దేశం తరపున అత్యధిక మ్యాచ్ లు ఆడిన సాకర్ ప్లేయర్ గా ఆయన హిస్టరీ క్రియేట్ చేశారు. అంతకు ముందు ఈ రికార్డు కువైట్ కు చెందిన బాదర్ అల్ ముతావా పేరిట ఉండేది. ఆయన కువైట్ తరపున 196 మ్యాచ్ లు ఆడారు. ప్రస్తుతం జరుగుతున్న యూరో కప్ లో యూరోపియన్ దేశం లిచెన్ స్టెయిన్ పై రొనాల్డో 197వ మ్యాచ్ ఆడాడు. అంతేకాదు, ఈ మ్యాచ్ లో రొనాల్డో అదరగొట్టాడు. రెండు గోల్స్ చేసి సత్తా చాటాడు. పోర్చుగల్ తరపున 197 మ్యాచ్ లు ఆడిన రొనాల్డో 120 గోల్స్ చేసి ఆల్ టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.


More Telugu News