భార్యకు ఎన్టీఆర్ క్యూట్ విషెస్!

  • లక్ష్మీ ప్రణతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్
  • ‘హ్యాపీ బర్త్ డే అమ్మలు’ అంటూ ఇన్ స్టాలో పోస్ట్
  • కామెంట్ల వర్షం కురిపిస్తున్న అభిమానులు

తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన యంగ్ టైగర్.. ‘హ్యాపీ బర్త్ డే అమ్మలు’ అంటూ స్పెషల్ విషెస్ తెలిపారు.

ఆయన ఇలా పోస్ట్ చేయగానే.. అలా కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘హ్యాపీ బర్త్ డే వదిన’ అంటూ ఈ రోజు ఉదయం నుంచి అభిమానులు విష్ చేస్తున్నారు. 9 లక్షల మందికి పైగా లైక్ చేశారు. 6 వేల మందికి పైగా కామెంట్లు చేశారు. ఎన్టీఆర్ తన సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్యామిలీకి సమయం కేటాయిస్తుంటారు. తన భార్యతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్ఆర్ గుర్తింపు తెచ్చుకోవడంతో మంచి జోష్ లో ఉన్న ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ఇందులో ఎన్టీఆర్ సరసన జంటగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తోంది. గతంలో కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.


More Telugu News