ఇంత కంటే మంచి బహుమతి ఉండదు: రామ్ చరణ్

  • ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న రామ్ చరణ్
  • శంకర్ తో చేస్తున్న సినిమా టైటిల్, లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
  • ‘గేమ్ చేంజర్’ పోస్టర్ ను ట్వీట్ చేసిన ఆర్ఆర్ఆర్ స్టార్
‘ఆర్ఆర్ఆర్’ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తన తండ్రి చిరంజీవి మొదలు.. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.. ఇంకా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగానే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పేరు, పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

సినిమాకు ‘గేమ్ చేంజర్’ అని పేరు పెట్టారు. ఇక ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో చరణ్‌ అల్ట్రా స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. దీనిపై రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘పుట్టిన రోజున ఇంత కన్నా మంచి బహుమతి ఉండదు.. థ్యాంక్యూ శంకర్ సర్’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. గేమ్ చేంజర్ చిత్రంలో చరణ్‌కు జోడీగా కియారా అద్వాని నటిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందించాడు. థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 


More Telugu News