గతేడాది నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒకటి మృతి
- భారత్ లో 1950 తర్వాత కనిపించని చీతాలు
- నమీబియా నుంచి 8 చీతాలను రప్పించిన భారత్
- గతేడాది కునో అభయారణ్యంలో విడుదల చేసిన మోదీ
- కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సాషా అనే చీతా మృతి
గతేడాది నమీబియా నుంచి భారత్ కు 8 చీతాలను భారత్ కు తీసుకురాగా, మధ్యప్రదేశ్ లోని కునో అభయారణ్యంలో ప్రధాని మోదీ ఆ చీతాలను విడుదల చేశారు. అయితే, ఆ చీతాల్లో ఒకటి మరణించింది. దాని పేరు సాషా. కిడ్నీ వ్యాధితో ఈ చీతా మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. భారత్ కు తీసుకు రాకముందే ఈ చీతాకు కిడ్నీ వ్యాధి చికిత్స అందించారని వివరించారు. భారత్ కు తీసుకువచ్చిన తర్వాత ఇటీవల ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో మృతి చెందిందని తెలిపారు. భారత్ లో 1950 తర్వాత చీతాలు కనుమరుగయ్యాయి. జీవవైవిధ్యం కాపాడే ఉద్దేశంతో ఆఫ్రికా నుంచి భారత్ కు చీతాలను రప్పించారు. గతేడాది ఈ చీతాలు ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్నాయి.