వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మాట్లాడడానికి నువ్వెవరు అంటున్నారు: కేటీఆర్
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్
- ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ లేఖ
- కొందరు తనను ప్రశ్నిస్తున్నారన్న కేటీఆర్
ఏపీలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాయడం తెలిసిందే. అయితే, ఈ విషయంలో కొందరు తనను ప్రశ్నిస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకంపై నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటున్నారని తెలిపారు. ఇప్పుడే కాదు, 2021 నుంచి తాను ఈ అంశంపై అనేక పర్యాయాలు మాట్లాడుతూనే ఉన్నానని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు మద్దతిస్తూనే ఉన్నానని కేటీఆర్ వివరించారు. మరీ ముఖ్యంగా, ఇప్పుడు గనుక మనం ఈ అంశంపై మాట్లాడకపోతే, మోదీ సర్కారు తదుపరి సింగరేణి కాలరీస్ ను ప్రైవేటు పరం చేస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఈ క్రమంలో ఇతరుల సమస్యలపై నువ్వు మాట్లాడకపోతే, చివరికి నీ సమస్యపై మాట్లాడడానికి ఎవరూ మిగలరన్న మార్టిన్ నీమోలర్ పాప్యులర్ సూక్తిని కూడా కేటీఆర్ పంచుకున్నారు.