13 మంది పిల్లల తర్వాత ఎట్టకేలకు వేసెక్టమీ ఆపరేషన్

  • తమిళనాడులోని ఓ కుటుంబం అనుసరిస్తున్న మత విశ్వాసం
  • 13వ బేబీ జననం తర్వాత తల్లికి తీవ్ర రక్త హీనత
  • ప్రాణాలకు ప్రమాదం ఉందని కౌన్సెలింగ్ నిర్వహించిన అధికారులు
కుటుంబ నియంత్రణ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయనేది నిస్సందేహం. ఎవరికి తోచిన విధంగా వారు పిల్లలను కంటూ వెళితే జనాభా సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు, ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వడం అనేది మహిళల ప్రాణాలకు ముప్పును తెచ్చి పెడుతుంది. తమిళనాడులో ఓ వ్యక్తి ఇలానే 13 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు. దీంతో అధికారులు రంగంలోకి దిగి సదరు వ్యక్తిని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ఒప్పించాల్సి వచ్చింది.

అతడి పేరు చిన్న మతైయాన్ (46). గత వారమే అతడి భార్య శాంతి (40) 13వ బేబీకి జన్మనిచ్చింది. మతపరమైన సంప్రదాయం మేరకు వారు కుటుంబ నియంత్రణ సర్జరీ చేయించుకోవడం లేదు. ఏడుగురు బాబులు, ఐదుగురు పాపలు ఉండగా, గతావారం మరో మగ శిశువు వీరికి కలిగాడు. డెలివరీ తర్వాత శాంతి తీవ్ర రక్తహీనతకు గురైంది. మరో బేబీకి జన్మనివ్వాల్సి వస్తే మరణించే ప్రమాదం ఉందని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ కే శాంతి కృష్ణన్ తెలిపారు. వీఏవో, మెడికల్ ఆఫీసర్, పోలీసులు సంయుక్తంగా నాలుగు రోజుల పాటు కౌన్సెలింగ్ ఇచ్చి అదే విషయాన్ని మతైయాన్ కు వివరించారు. దీంతో మతైయాన్ వేసెక్టమీ సర్జీకి ముందుకు వచ్చాడు. ఆదివారం ఈ రోడ్ జిల్లా అందియూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో సర్జరీ చేశారు.


More Telugu News