ఏప్రిల్ 13 నుంచి 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమం
- క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం
- పార్టీ కార్యక్రమాలపై కర్తవ్య బోధ
- గేర్ మార్చి స్పీడు పెంచాలని స్పష్టీకరణ
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఇవాళ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజవకర్గాల ఇన్చార్జిలు, ప్రాంతీయ కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. ఇక గడప గడపకు కార్యక్రమంపై గేర్ మార్చి స్పీడు పెంచాలని ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఇక, కొత్తగా వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 13న 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని తీసుకువస్తున్నట్టు వెల్లడించారు.
ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడం అత్యంత ప్రాధాన్య అంశం అని తెలిపారు. డీబీటీ ద్వారా ఇవాళ ఒక్క బటన్ నొక్కితే నేరుగా ప్రజల ఖాతాల్లోకి నగదు చేరుతోందని అన్నారు. 87 శాతం ఇళ్లకు లబ్ది చేకూరుతోందని వివరించారు.
ఇది ఎందుకు చెబుతున్నానంటే... ఈ మధ్య కాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చూసినా... చంద్రబాబు అనే వ్యక్తి మాటలు విన్నా, తలలో అపోహలు ఏర్పడతాయని, వాటిని తొలగించేందుకు ఇవాళ ఇవన్నీ చెప్పాల్సి వస్తోందని సీఎం జగన్ వివరించారు