వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగి అనుమానాస్పద మృతి
- డ్యూటీలోనే ఉన్నట్టుండి కుప్పకూలిన డీజీఎం
- ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆగిన ఊపిరి
- కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ (పీపీఎం) విభాగంలో డీజీఎంగా పనిచేస్తున్న టి.వి.వి. ప్రసాద్ సోమవారం అనుమానాస్పదంగా చనిపోయారు. సోమవారం ఉదయం విధులకు హాజరైన ప్రసాద్.. మూడో అంతస్తులోని తన గదికి వెళుతుండగా కుప్పకూలారు. తోటి ఉద్యోగులు ఆయనకు వెంటనే ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. స్టీల్ జనరల్ ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆయన ఊపిరి ఆగిపోయింది.
ఆసుపత్రికి చేరుకున్నాక ప్రసాద్ ను పరీక్షించిన వైద్యులు.. ఆయన అప్పటికే చనిపోయారని నిర్ధారించారు. ఈ ఘటనపై డిప్యూటీ డీజీఎం సహదేవ్ కుమార్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
టి.వి.వి. ప్రసాద్ 1995లో మేనేజ్ మెంట్ ట్రైనీగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ డీజీఎం స్థాయికి చేరుకున్నారు. సోమవారం ఉదయం జనరల్ షిఫ్ట్ లో ప్రసాద్ విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో తన గదికి వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలారని సహోద్యోగులు తెలిపారు. కాగా, అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వైద్యుల నివేదిక ఆధారంగా విచారణ జరుపుతామని వెల్లడించారు.