నెమలి గుడ్లు దొంగిలించేందుకు చెట్టెక్కిన మహిళకు ఊహించని గుణపాఠం
- నెట్టింట వీడియో వైరల్
- తన గుడ్లు దొంగిలించేందుకు వచ్చిన మహిళపై నెమలి ప్రతాపం
- గోళ్లతో రక్కుతూ రణరంగం
- తగిన శాస్తి జరిగిందంటూ నెటిజన్ల కామెంట్స్
చూడముచ్చటగా ఉండే నెమళ్లకు తిక్కరేగితే ఎలా ఉంటుందో, వాటి ప్రతాపం ఏస్థాయిదో చెప్పే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. ఓ ఇద్దరు మహిళలు నెమలి గుడ్లు దొంగిలించేందుకు ప్రయత్నిస్తారు. ఓ మహిళ చెట్టెక్కి గూడులో ఉన్న గుడ్లను కింద నిలబడ్డ మహిళకు అందించసాగింది. ఇదంతా దూరం నుంచే గమనించిన నెమలి ఎగురుకుంటూ వచ్చి ఒక్కసారిగా చెట్టుపై నిలబడ్డ మహిళపై దాడి చేస్తుంది. గోళ్లతో పొడుస్తూ చుక్కలు చూపిస్తుంది. ఆ తరువాత చెట్టు పక్కనే నిలబడ్డ మరో మహిళపైనా దాడికి దిగుతుంది.
నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ సంబర పడుతున్నారు. మహిళలకు తగిన శాస్తే జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారికి ఈ గుణపాఠం సరిపోదని మరికొందరు కామెంట్ చేశారు. అయితే, కొందరు మాత్రం ఈ మొత్తం తతంగంపై సందేహాలు వ్యక్తం చేశారు. వ్యూస్ కోసం కావాలనే ఎవరైనా డ్రామా ఆడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.