విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు ముగిసిన గడువు
- విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఈవోఐ ప్రకటన
- బిడ్లు దాఖలు చేసిన 29 సంస్థలు!
- వాటిలో 7 విదేశీ సంస్థలు!
- బిడ్డింగ్ కు దూరంగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు!
విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రం ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ)లకు ఆహ్వానం పలకడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ కు నేటితో గడువు ముగిసింది. మొత్తం 29 సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీనిపై కార్మిక నేత అయోధ్య రామ్ స్పందించారు.
7 విదేశీ సంస్థలు ఈవోఐ దాఖలు చేశాయని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆసక్తి చూపినట్టు సమాచారం లేదని తెలిపారు. ఎన్ఎండీసీ వంటి కేంద్ర సంస్థలు కూడా ఈవోఐ దాఖలు చేయలేదని అయోధ్యరామ్ పేర్కొన్నారు.
కాగా, విశాఖ ఉక్కు పరిశ్రమ ఈవోఐ నేపథ్యంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా బిడ్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్లాంట్ మళ్లీ గాడిన పడేందుకు నాలుగు నెలల పాటు నెలకు రూ.850 కోట్లు ఖర్చు చేస్తే చాలని, ఆ మొత్తాన్ని తాము క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరిస్తామని లక్ష్మీనారాయణ వెల్లడించడం చర్చనీయాంశం అయింది.
అంతకంటే ముఖ్యంగా, ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తో చేయి కలపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.