ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి ఎదురైన రెండు ప్రమాదాలు ఇవేనట!

  • హాస్య నటుడుగా ధర్మవరపుకి మంచి పేరు 
  • ఆయన గురించి చెప్పుకొచ్చిన తనయుడు 
  • వనస్థలిపురంలో జరిగిన ప్రమాదం గురించి ప్రస్తావన
  • ఫారెస్టులో షూటింగు చేసి వచ్చి పడిపోయారని వెల్లడి
స్టార్ కమెడియన్ గా ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి మంచి పేరు ఉండేది. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ  లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉండేవి. అలాంటి ధర్మవరపు సుబ్రహ్మణ్యం గురించి ఆయన తనయుడు రవి బ్రహ్మ మాట్లాడుతూ .. "హైదరాబాద్ .. వనస్థలిపురంలో ఒకసారి నాన్నగారికి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆయన కారును బస్సు ఇవతల వైపు నుంచి ఎక్కేసి అవతల వైపుకు దిగింది. కారు చాలావరకూ డ్యామేజ్ అయింది" అని అన్నారు. 

"నాన్నగారికి ఆ ప్రమాదం జరిగినప్పుడు  లక్కీగా వెల్డింగ్ చేసే వ్యక్తి అటుగా వెళుతూ ఆగారు. కారు పై భాగాన్ని కట్ చేసి నాన్నగారిని పైకి లాగారు. కామినేనిలో నాన్నగారికి చేతికి .. తలకి మేజర్ ఆపరేషన్స్ జరిగాయి. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి చాలామంది వచ్చి పరామర్శించారు. ఆ ప్రమాదం నుంచి ఆయన నిదానంగా కోలుకున్నారు" అని చెప్పారు. 

ఆ తరువాత నాన్నగారు 'శ్వేతనాగు' సినిమా షూటింగులో పాల్గొన్నారు. బెంగుళూర్ సమీపంలోని ఒక ఫారెస్టులో షూటింగు జరిగింది. ఆ తరువాత ఆయన తన రూమ్ కి వెళ్లి ఎంతసేపటికి బయటికి రాలేదు. వెళ్లి చూస్తే బెడ్ పై పడిపోయి ఉన్నారు .. మనలో లేరు. వెంటనే హాస్పిటల్లో చేర్పించాము. ఫారెస్టులో ఏదో కీటకం కుట్టడం వలన అలా జరిగిందనీ .. స్మోక్ చేయడం కూడా ఒక కారణమని అన్నారు. తొమ్మిది పది రోజులు కోమాలో ఉన్నారు" అని చెప్పుకొచ్చారు. 


More Telugu News