అత్యంత ఘనంగా ఉపాసన సీమంతం... ఫొటోలు ఇవిగో!
- త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉపాసన, రాంచరణ్
- దుబాయ్ లో ఉపాసనకు ఘనంగా సీమంతం
- హైదరాబాదులోనూ మరో రెండు వేడుకలు
- హాజరైన చిరంజీవి, కామినేని కుటుంబ సభ్యులు
- అలరించిన ఉపాసన ఫ్రెండ్స్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన త్వరలోనే తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలకనున్నారు. ఈ నేపథ్యంలో, ఉపాసన సీమంతం దుబాయ్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఆ తర్వాత అత్యంత సన్నిహితుల మధ్య హైదరాబాద్‌లో మరో రెండు వేడుకలు వైభవంగా జరిగాయి.
ఒక వేడుకలో ఉపాసన పింక్ షిమ్మరీ వస్త్రాలంకరణతో మెరిసిపోయారు. మరో చోట బ్లూ ఫ్రీ ఫ్లోయింగ్ డ్రెస్‌తో తళుకులీనారు. రామ్‌చరణ్ తనకు నచ్చిన నలుపు రంగు దుస్తుల్లో ఒకచోట, వైట్ షర్ట్ విత్ స్మార్ట్ చినోస్‌లో మరోచోట స్మార్ట్ గా కనిపించారు.
ఈ పార్టీలకు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ చెల్లెళ్లు సుస్మిత, శ్రీజతో పాటు ఉపాసన తల్లి శోభన కామినేని, సంగీతారెడ్డి కూడా ఈ వేడుకలో పాలుపంచుకుని ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
ఇక ఉపాసన ఫ్రెండ్స్ పింకీ రెడ్డి, సానియా మీర్జా, కనికా కపూర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకలో అలరించారు. కాబోయే అమ్మ ఉపాసనను తమ ప్రేమాభిమానాలతో ఆహూతులందరూ ముద్దు చేశారు. ఈ ఫంక్షన్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.