ప్రయాణికుల గొడవతో ఆస్ట్రేలియాలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. వీడియో ఇదిగో!
- విమానంలో కొట్టుకున్న ముగ్గురు ప్రయాణికులు
- గొడవకు కారణమైన వారిని అరెస్టు చేసిన పోలీసులు
- క్వీన్స్ లాండ్ నుంచి డార్విన్ కు వెళుతున్న విమానంలో ఘటన
ప్రయాణికుల మధ్య గొడవ కారణంగా ఓ విమానాన్ని పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికుల కొట్లాటలో విమానం కిటికీ ఒకటి బద్దలు కావడంతో దగ్గర్లోని విమానాశ్రయంలో దింపాల్సి వచ్చిందని పైలట్ చెప్పారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. క్వీన్స్ లాండ్ నుంచి నార్తరన్ టెరిటరీలోని డార్విన్ కు వెళుతున్న విమానంలో ప్రయాణికులు గొడవ పడ్డారు. విమానం బయలుదేరిన కాసేపటికే ఓ 23 ఏళ్ల యువతి ఫ్లైట్ సిబ్బందితో అమర్యాదకరంగా ప్రవర్తించింది. దీంతో విమానాన్ని వెనక్కి తిప్పిన పైలట్.. సదరు యువతిని దింపేసి తిరిగి బయల్దేరారు.
ఆ తర్వాత కాసేపటికే విమానంలో మరోమారు గొడవ మొదలైంది. క్వీన్స్ లాండ్ లో దింపేసిన యువతికి సంబంధించిన వారు మరొక గ్రూపుతో వాగ్వాదానికి దిగారు. ఇదికాస్తా ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఈ గొడవలో విమానం కిటికీ ఒకటి బద్దలైంది. దీంతో అధికారులను సంప్రదించిన పైలట్.. దగ్గర్లోని విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం ల్యాండ్ అయ్యాక ఓ యువకుడు, ఇద్దరు మహిళలను ఆస్ట్రేలియా ఫెడరల్ సర్వీస్ (ఏఎఫ్ పీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.