ఆదిపురుష్ కోసం సీతమ్మ ఎదురు చూపులు
- ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ చిత్రం
- సీత పాత్రలో నటించిన కృతీ సనన్
- ఆమె పోస్టర్లను విడుదల చేసిన చిత్ర బృందం
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ నటి కృతీసనన్ సీత పాత్ర పోషిస్తోంది. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ‘ఆదిపురుష్’ చిత్రం వాయిదా పడింది. వీఎఫ్ ఎక్స్ పనులు పూర్తి చేసుకొని ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అయింది. దాంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. సినిమా నుంచి వరుసగా అప్ డేట్స్ ఇస్తోంది.
కొత్త పోస్టర్లు, టీజర్లతో సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ క్రమంలో తాజాగా కృతీసనన్ సీత పాత్రను పరిచయం చేస్తూ కొత్త పోస్టర్ల ను విడుదల చేసింది. ఇందులో లంకలో ఉన్న ఆమె రాముడి రాక కోసం కంటతడితో ఎదురుచూస్తున్నట్లు కనిపించింది. అమరం, అఖిలం ఈ నామం, సీతారాముల ప్రియనామం అంటూ ‘జై సియా రామ్’ ఆడియో టీజర్‌ను కూడా విడుదల చేసింది. కొత్త పోస్టర్‌లో సీతమ్మగా కృతి సనన్ ఆకట్టుకునేలా కనిపించింది. కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా కనిపించనున్నాడు. టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి.