ఓవైపు వర్షం.. మరోవైపు మంచు.. నిలిచిన ఛార్ దామ్ యాత్ర

  • యాత్రీకులను శ్రీనగర్ లో ఆపేసిన అధికారులు
  • ఆన్ లైన్ రిజర్వేషన్ ఉన్నోళ్లకు రుద్రప్రయాగ్ వరకు అనుమతి
  • ఉత్తరాఖండ్ ఎన్ఐటీ, బద్రీనాథ్ బస్టాండ్ ఏరియాల్లో చెక్ పోస్టులు
వాతావరణం అనుకూలించక పోవడంతో ఛార్ దామ్ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. ఓవైపు ఇంకా మంచు కురుస్తుండడం, మరోవైపు వర్షాల కారణంగా యాత్రకు బ్రేక్ పడింది. ముందు జాగ్రత్త చర్యగా యాత్రికులను పోలీసు అధికారులు శ్రీనగర్ లోనే ఆపేస్తున్నారు. రాత్రిపూట బస ఏర్పాట్లను ముందే ఆన్ లైన్ లో రిజర్వ్ చేసుకున్న వారిని మాత్రమే రుద్రప్రయాగ్ వరకు అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారు శ్రీనగర్ లోనే ఉండాలని కోరారు.

యాత్రికుల భద్రత దృష్ట్యా వాతావరణం క్లియర్ అయ్యేంత వరకు ముందుకు అనుమతించలేమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇందుకోసం శ్రీనగర్ లో ఛార్ దామ్ యాత్రికులు ఎక్కువగా ఆగే ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉత్తరాఖండ్ లోని ఎన్ఐటీ, బద్రీనాథ్ బస్టాండ్ ఏరియాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, మిగతా చోట్ల కూడా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.


More Telugu News