తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు
- తెలంగాణలో అకాల వర్షాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం
- ఈదురు గాలులతో, వడగళ్ల వర్షం
- ఆంధ్రప్రదేశ్ లోను పలు చోట్ల భారీ వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అకాల వర్షాలు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రధానంగా ధాన్యం తడిసి, రైతులకు కన్నీరు తప్పడంలేదు. ఈ రోజు సాయంత్రం కూడా జనగామ, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబాబాద్, పాలకుర్తి, దేవరప్పుల, సిరిసిల్ల, సిద్దిపేట, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది.
మహబూబాబాద్ లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. జనగామ, నిజామాబాద్ సిరికొండ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. నిర్మల్, భైంసా, కామారెడ్డిలోని సుల్తాన్ పేటలో వడగళ్ల వాన కురిసింది. సిరిసిల్ల రుద్రంగిలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. అటు, ఆంధ్రప్రదేశ్ లోని పలుచోట్ల కూడా వర్షాలు కురిశాయి.