'ఏజెంట్' మూవీ మండే టాక్!
- ఈ నెల 28వ తేదీన విడుదలైన 'ఏజెంట్'
- యాక్షన్ కి మాత్రమే పెద్దపీట వేసిన దర్శకుడు
- లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ కి దూరంగా నడిచిన కథ
- అఖిల్ పాత్రను డిజైన్ చేసిన తీరు పట్ల ఫ్యాన్స్ అసంతృప్తి
మొదటి నుంచీ కూడా అఖిల్ భారీ సినిమాలే చేస్తూ వచ్చాడు. ఆ కథలు విదేశాల నేపథ్యంలో నడిచేవే. ఎక్కువగా కొత్త హీరోయిన్స్ తో సినిమాలు చేస్తూ వచ్చిన అఖిల్, జోనర్ ఏదైనా తన సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఉండేలా చూసుకున్నాడు. ఈ సారి మాత్రం పూర్తి యాక్షన్ సినిమాగా 'ఏజెంట్' చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 28న థియేటర్లకు వచ్చింది.
ఈ సినిమాలో ఒక రేంజ్ యాక్షన్ ఉంటుందనే విషయం థియేటర్స్ కి వెళ్లకమునుపే ఆడియన్స్ కి తెలుసు. అయితే ఈ యాక్షన్ తో పాటు లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ ఏ స్థాయిలో ఉంటాయనేది చూడాలనే ఆసక్తితో వాళ్లు థియేటర్లకు వచ్చారు. అయితే సురేందర్ రెడ్డి యాక్షన్ ను తప్ప ఇతర అంశాలను పట్టించుకోకపోవడం వాళ్లను తీవ్రమైన నిరాశకు గురిచేసింది.
ఇంతవరకూ అఖిల్ సినిమాలలో ఫ్లాప్ అయిన వాటిలో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్న పాటలు ఉన్నాయి. కానీ ఈ సినిమాలో ఒక్క పాట కూడా జనంలోకి వెళ్లలేదు. వక్కంతం వంశీ అందించిన కథలు కొన్ని నిరాశపరిచినప్పటికీ, ఈ స్థాయిలో అవి విమర్శలను అందుకోలేదు. సురేందర్ రెడ్డి మార్క్ కి దూరంగా కనిపించడమే ఈ స్థాయిలో ఈ సినిమా నిరాశపడటానికి కారణమనే టాక్ తొలిరోజునే వినిపించింది .. ఈ రోజుకి కూడా అదే కంటిన్యూ అవుతోంది.