ఫ్లిప్ కార్ట్ లో మొదలైన వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ విక్రయాలు

  • ఎక్స్ 90, ఎక్స్ 90 ప్రో మోడళ్ల అమ్మకాలు మొదలు
  • వీటి ధరలు రూ.59,999 నుంచి ప్రారంభం
  • పలు బ్యాంకుల కార్డులపై 10 శాతం క్యాష్ బ్యాక్
  • పాత ఫోన్ ఎక్సేంజ్ పై అదనపు బోనస్
వివో ఫ్లాగ్ షిఫ్ ఫోన్ వివో ఎక్స్ 90, ఎక్స్ 90 ప్రో అమ్మకాలు ఫ్లిప్ కార్ట్ లో మొదలయ్యాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ లో భాగంగా దీనిపై డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయి. కెమెరా ప్రధాన ఆకర్షణగా ఈ ఫోన్ ను వివో తీసుకొచ్చింది. ఫ్లిప్ కార్ట్ తో పాటు వివో ఇండియా ఈ స్టోర్, భాగస్వామ్య రిటైల్ స్టోర్లలో అమ్మకాలు నేటి నుంచి మొదలయ్యాయి. 

వివో ఎక్స్ 90 ప్రో ఫోన్ కు లెదర్ ఫినిష్ ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.84,999. వివో ఎక్స్ 90 వేరియంట్ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.59,999. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ.63,999. బ్రీజ్ బ్లూ, ఆస్టరాయిడ్ బ్లాక్ రంగుల్లో లభిస్తాయి. ఎస్ బీఐ, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంకు కార్డులపై 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. ఫోన్ ఎక్సేంజ్ పై రూ.8,000 బోనస్ కూడా ఇస్తారు. 

ఎక్స్ 90, ఎక్స్ 90 ప్రో రెండూ కూడా 6.78 అంగుళాల 3డీ కర్వ్ డ్ డిస్ ప్లేతో ఉంటాయి. 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, జీస్ నేచురల్ కలర్ 2.0 లెన్స్, డ్యుయల్ స్టీరియో స్పీకర్ ఉన్నాయి. జీస్ భాగస్వామ్యంతో కెమెరా విషయంలో అత్యాధునిక ఫీచర్లు ప్రవేశపెట్టారు. ప్రో ఇమేజింగ్ చిప్ వీ2, మీడియాటెక్ డెమెన్సిటీ 9200 చిప్ ఉన్నాయి. తక్కువ వెలుగులోనూ ఫొటోలను మంచిగా ఇది తీయగలదు. ఎక్స్ 90లో 4810 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎక్స్ 90 ప్రోలో 4870 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తో వేగంగా చార్జ్ చేసుకోవచ్చు.


More Telugu News