మంత్రి బొత్సతో ముగిసిన ఉపాధ్యాయ సంఘాల సమావేశం

  • పలు అంశాలపై బొత్సతో చర్చించిన ఉపాధ్యాయ సంఘాలు
  • మరో 10 రోజుల్లో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రారంభం
  • రేపు పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్నామన్న బొత్స
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమావేశం ముగిసింది. విద్యార్థులకు ఒకేసారి కిట్ల పంపిణీ, జూన్ నెలాఖరు వరకే యాప్ లో హాజరు, బదిలీలకు సంబంధించి పాత సర్వీసుల పరిగణన వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

అవసరమైతే బదిలీ కోడ్ తెస్తామని మంత్రి చెప్పారని ఉపాధ్యాయ సంఘాల నేతలు వెల్లడించారు. పాత జీవోలను యథాతథంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు. 

అటు, మంత్రి బొత్స స్పందిస్తూ... యాప్ కారణంగా సమయం వృథా అవుతోందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయని, దాంతో పని ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి సారించాలని సూచించారు. మరో 10 రోజుల్లో ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియ ప్రారంభిస్తామని బొత్స వెల్లడించారు. 

ఇక, పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల గురించి కూడా మాట్లాడారు. రేపు ఉదయం 11 గంటలకు 10వ తరగతి ఫలితాలు వెల్లడిస్తామని, ఈసారి కేవలం 18 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది ఎలాంటి లీకేజిలు లేవని అన్నారు.


More Telugu News