త్రిష ప్రియుడ్ని మీరు ప్రేమించారా అన్న ప్రశ్నకు బిందు మాధవి జవాబు ఇదే!

  • ఆవకాయ్ బిర్యానీతో ఎంట్రీ ఇచ్చిన బిందు మాధవి
  • ప్రస్తుతం తమిళ చిత్రపరిశ్రమలో బిజీ
  • ఆహా ఓటీటీ కోసం న్యూసెన్స్ వెబ్ సిరీస్ లో నటించిన అమ్మడు
  • ప్రమోషన్ ఈవెంట్ లో ఆసక్తికర సన్నివేశం
తెలుగులో ఆవకాయ్ బిర్యానీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన బిందు మాధవి ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో బిజీగా ఉంది. అంతేకాదు, ఇటీవల యాంగర్ టేల్స్ వెబ్ సిరీస్ తోనూ బిందు మాధవి సందడి చేసింది. తాజాగా ఆహా ఓటీటీ కోసం న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. 

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా బిందు మాధవి మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా, త్రిష ప్రియుడ్ని మీరు ప్రేమించారా అనే ప్రశ్న మీడియా నుంచి ఎదురైంది. అందుకు బిందు మాధవి అవును అంటూ సమాధానం చెప్పింది. 

అయితే, త్రిష, ఆమె ప్రియుడు విడిపోయిన తర్వాతే తాను అతడికి సన్నిహితం అయ్యానని క్లారిటీ ఇచ్చింది. కొన్నాళ్ల కిందట త్రిష, తమిళ వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో ప్రేమలో పడింది. వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ వీరి మధ్య అనుబంధం పెళ్లికి ముందే విచ్ఛిన్నమైంది. 

ఆ తర్వాత వరుణ్ మణియన్, బిందు మాధవి కలిసున్న ఫొటోలు దర్శనమివ్వడంతో ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరిగింది. అయితే, ఇన్నాళ్లకు అది ప్రేమ అని వెల్లడైంది.


More Telugu News