నేను పెళ్లి కోసం మతం మార్చుకోలేదు..ఖుష్బూ స్పష్టీకరణ

  • నెట్టింట ట్రోల్స్‌కు గట్టి జావాబిచ్చిన ఖుష్బూ సుందర్
  • తన వివాహాన్ని ప్రశ్నించేవాళ్లు తమ అవగాహన మెరుగు పరుచుకోవాలని సూచన
  • ట్రోల్స్ చేసేవారికి స్పెషల్ మ్యారేజస్ యాక్ట్ గురించి తెలియకపోవడం విచారకరమని వ్యాఖ్య
వివాహం చేసుకునేందుకు తాను మతం మార్చుకోలేదంటూ నటి, రాజకీయ నేత ఖుష్బూ సుందర్ తాజాగా స్పష్టం చేశారు. తన పెళ్లి విషయంలో ట్రోల్ చేసే నెటిజన్లకు ఆమె గట్టి జవాబు ఇచ్చారు. ‘‘నా పెళ్లిని ప్రశ్నించేవాళ్లు, పెళ్లి కోసం నేను మతం మార్చుకున్నానని ఆరోపించే వాళ్లు కాస్త వివేకం, అవగాహన పెంచుకుంటే మంచిది. మన దేశంలో స్పెషల్  మ్యారేజస్ యాక్ట్ ఉందన్న విషయం వారికి తెలియకపోవడం నిజంగా విచారకరం. నేను మతం మార్చుకోలేదు. మతం మారమని నన్నెవరూ ఒత్తిడి కూడా చేయలేదు. 23 ఏళ్ల నా వైవాహిక బంధం ఎంతో ధ్రుఢంగా ఉంది. పరస్పర నమ్మకం, గౌరవం, సమానత్వం, ప్రేమ దానికి పునాది. కాబట్టి, ఈ విషయంలో సందేహాలు ఉన్నవాళ్లు తమ దారి తాము చూసుకుంటే మంచిది’’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఖుష్బూ.


More Telugu News