రేపటి నుంచి తిరుమలలో హనుమజ్జయంతి ఉత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ
- ఆంజనేయస్వామికి అభిషేకాలు, అర్చనలు, నివేదనలు
- జాపాలి తీర్థంలో స్వామివారికి అభిషేకం
- పాపవినాశన మార్గంలో ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతి
తిరుమలలోని అంజనాద్రిపై రేపటి నుండి 18వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. తిరుమలలోని వివిధ ఆలయాల వద్ద కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఆంజనేయస్వామికి విశేషంగా అభిషేకాలు, అర్చనలు, నివేదనలు నిర్వహిస్తారు. జాపాలి తీర్థంలో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. హనుమజ్జయంతి రోజైన మే 14వ తేదీన పాపనాశనం మార్గంలో ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.