వైరల్ వీడియో.. మగ, ఆడ పులి మధ్య ఫైట్.. ఒక్క చూపుతో కంట్రోల్ చేసిందిగా!

  • మగ పులి ఆహారాన్ని దొంగిలించబోయిన ఆడ పులి
  • కేవలం చూపులతో ఆడ పులిని కంట్రోల్ చేసిన మగ పులి
  • నెట్టింట వీడియో వైరల్
పులి అంటే ఇతర జంతువులన్నిటికీ భయమే. అందులో మగ పులి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! మరి మగ పులి, ఆడ పులి ఫైట్‌కు దిగితే గెలుపెవరిది? దీనికి సమాధానంగా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఓ మగ పులి దుప్పి లాంటి జంతువును వేటాడి చంపేస్తుంది. ఇంతలో దాని దృష్టి మళ్లడంతో పక్కకు వెళ్లింది. 

ఈలోపు ఆ జంతువు మృతదేహం ఓ ఆడ పులి కంట పడింది. ఇంకేముంది.. దాన్ని పొదల్లోకి లాక్కుపోయే ప్రయత్నం చేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన మగ పులి ఆడ పులిపై ఇంతెత్తున లేచింది. దాన్ని చూడగానే ఆడ పులి భయంతో నేలకు కరుచుకుపోయింది. మగ పులి పెద్దగా ప్రయత్నించకుండానే ఆడ పులిని అదుపులోకి తెచ్చింది. కేవలం చూపులతోనే ఆడ పులిని కంట్రోల్ చేసినట్టు ఉంటుందీ వ్యవహారం. 

ఇదంతా చూసి నెటిజన్లు కామెంట్ల వరద పారిస్తున్నారు. ‘‘విజయం తనదేనని మగ పులికి ముందే తెలుసు. అందుకే కేవలం చూపులతోనే ఆడ పులిని నిగ్రహించింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన పులి చివరకు ఆహారాన్ని పొదల్లోకి లాక్కునిపోయింది. మగ, ఆడ పులుల మధ్య ఇంతటి తేడా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరి ఈ లింక్‌ ద్వారా మీరూ ఈ వీడియోను చూసేయండి!



More Telugu News