ఆ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'ఆదిపురుష్' వరల్డ్ ప్రీమియర్ రద్దు.. శాకుంతలం ఎఫెక్టేనా!

  • జూన్16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఆదిపురుష్
  • మూడు రోజుల ముందు ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్‌లో ప్రీమియర్ షో వేస్తామని ప్రకటన
  • జూన్13న  ప్రీమియర్ షోలు రద్దు చేస్తున్నట్టు ప్రకటన 
రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంపై భారత్‌ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. జూన్ 16న ఈ చిత్రం పలు భాషల్లో విడుదల కానుంది. అంతకంటే ముందుగా జూన్13న ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో ఆది పురుష్ ప్రీమియర్ షోలు వేస్తామని చిత్రం బృందం గతంలో ప్రకటించింది. ఆ చిత్రోత్సవంలో ప్రదర్శించబోయే సినిమాల్లో ఆదిపురుష్ చిత్రం టికెట్లన్నీ అమ్ముడయ్యాయి. దాంతో, 15, 16న కూడా ప్రీమియర్లు వేయాలని నిర్ణయించారు. 

కానీ, తాజాగా ఈ నిర్ణయం నుంచి చిత్ర బృందం వెనక్కుతగ్గింది. జూన్13న ప్రీమియర్లను నిలిపివేసినట్టు ప్రకటించింది. జూన్15వ తేదీ సాయంత్రం మాత్రం చిత్రోత్సవంలో  మిగతా అమెరికా సినిమాలో ఆదిపురుష్ ప్రదర్శన ఉంటుందని తెలిపింది. 13న ప్రీమియర్ ను రద్దు చేయడానికి కారణాలను చిత్ర బృందం చెప్పలేదు. అయితే, సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం డిజాస్టర్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. శాకుంతలం చిత్ర బృందం విడుదలకు నాలుగు రోజుల ముందు హైదరాబాద్ లో ప్రీమియర్లు ప్రదర్శించారు. చిత్రం బాగా లేకపోవడంతో నెగెటివ్ టాక్ వచ్చింది. దాంతో, సినిమా విడుదలైన తర్వాత థియేటర్లకు జనాలు రాలేదు.


More Telugu News