పవన్ కల్యాణ్ 'బ్రో' డబ్బింగ్ పనులు ప్రారంభం
- పవన్, సాయిధరమ్ తేజ్ జంటగా బ్రో
- సముద్రఖని దర్శకత్వంలో చిత్రం
- ఇటీవలే షూటింగ్ పూర్తి
- ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో బ్రో
మామాఅల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధానపాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం బ్రో... ది అవతార్. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కూడా నటిస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకుడు. ఈ ఎంటర్టయినర్ మూవీ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా ఇప్పుడు డబ్బింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. హైదరాబాదులో డబ్బింగ్ కు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్రఖని తదితరులు పాల్గొన్నారు.
బ్రో చిత్రానికి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి డైలాగులు, స్క్రీన్ ప్లే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తుండడం విశేషం. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.