చంద్రబాబును దాటి.. తెలంగాణ సీఎం కేసీఆర్ అరుదైన రికార్డు
- ఏకబిగిన అత్యధిక కాలం సీఎంగా పని చేసిన కేసీఆర్
- జూన్2తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న బీఆర్‌ఎస్ అధినేత
- ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు పేరిట ఉన్న రికార్డు బ్రేక్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రికార్డు సృష్టించారు. తెలుగు రాష్ట్రానికి ఏకబిగిన అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన తెలుగు వ్యక్తిగా నిలిచారు. నూతన రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలి ఎన్నికల్లో గెలిచిన సీఎం కేసీఆర్.. 2014 జూన్2న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ జూన్2వ తేదీతో సీఎంగా ఆయన తొమ్మిదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. దాంతో, స్వాంతంత్ర్యానికి పూర్వం మద్రాసు ప్రెసిడెన్సీ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విరామం లేకుండా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా ఘనత సాధించారు.
ముఖ్యమంత్రులుగా పనిచేసిన తెలుగువారిలో, అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న రికార్డు టీడీపీ అధినేత నేత చంద్రబాబు నాయుడు పేరిట ఉన్నది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు మూడు విడతల్లో మొత్తం 13 ఏళ్ల 247 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అయితే ఆయన ఏకబిగిన ముఖ్యమంత్రిగా 8 ఏళ్ల 256 రోజులు ఉన్నారు. ఈ లెక్కన చంద్రబాబు రికార్డును కేసీఆర్ బ్రేక్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా గతంలో కాసు బ్రహ్మానందరెడ్డి ఏడేళ్ల 221 రోజులు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్ల 111 రోజుల పాటు పదవిలో నిర్విరామం కొనసాగారు.