గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ హఠాన్మరణం
- మే 31న చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మృతి
- చాలాకాలంగా శ్వాసకోస సమస్యలు, బీపీ, షుగర్‌తో ఇబ్బంది పడుతున్న సుదర్శన్
- బెల్లంపల్లిలోని కన్నాల బస్తీ వాసి
- నాలుగున్నర దశాబ్దాల క్రితమే ఉద్యమంలోకి
మావోయిస్టు అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ గుండెపోటుతో మృతి చెందారు. చత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలో మే 31న మధ్యాహ్నం ఆయన గుండెపోటుతో మృతి చెందినట్టు మావోయిస్టు పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కన్నాల బస్తీకి చెందిన సుదర్శన్ అలియాస్ ఆనంద్, అలియాస్ దూలా (69) ప్రస్తుతం బస్తర్ మావోయిస్టు పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన కటకం నాలుగున్నర దశాబ్దాల క్రితం ఉద్యమంలోకి వెళ్లారు.
సుదర్శన్ చాలాకాలంగా శ్వాసకోశ సమస్యలతోపాటు మధుమేహం, బీపీ సమస్యలతో బాధపడుతున్నట్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ తెలిపారు. విప్లవ సంప్రదాయాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ నెల 5 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సుదర్శన్ సంతాప సభలు నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.